5 కేంద్రాల్లోనే విడుదల... రూ.కోట్ల వర్షం కురిపించింది!
ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే దానివెనక సినిమా యూనిట్ కృషి ఉంటుంది. అలాగే బోలెడన్ని చిత్రమైన విశేషాలు కూడా ఉంటాయి. కొంతమంది హీరోలు తాము చేయము అన్న సినిమా సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇలాంటి అనుభవం దర్శకుడు శేఖర్ కమ్ములకు కూడా ఎదురైంది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో డాలర్ డ్రీమ్స్ తీసి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా లభిస్తుంది.
తన రెండో ప్రయత్నంలో భాగంగా మంచి 'ఆనంద్' సినిమా కథను సిద్ధం చేసుకున్నారు. దాన్ని పట్టుకొని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోతోపాటు కొందరు హీరోల చుట్టూ తిరిగారు. అయితే ఆ స్క్రిప్ట్ ఎవరికీ నచ్చలేదు. అసలు శేఖర్ ఏం తీయాలనుకుంటున్నాడనే విషయం కూడా వారికి అర్థం కాలేదంట. దీంతో ఈ సినిమాను తానే సొంతంగా తీయాలని నిర్ణయించుకున్నారు. NFDCతో కలిసి సినిమాను ప్రారంభించాడు. NFDC పరిమితి రూ.40 లక్షలు కాగా.. అది వెంటనే అయిపోయింది. తర్వాత తన స్నేహితుల సహాయంతో ఈ సినిమాను శేఖర్ కమ్ముల పూర్తిచేశాడు.

మొదటగా తీసిన డాలర్ డ్రీమ్స్ సినిమా అవార్డు సినిమా కావడంతో ఆనంద్ సినిమా కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తానే సొంతంగా ఉమ్మడి ఏపీలో కేవలం ఐదు కేంద్రాల్లోనే దీన్ని విడుదల చేశారు. విడుదలైన రెండోరోజు నుంచే స్థానికంగా ఉండే డిస్ట్రిబ్యూటర్లు తమకు ఈ సినిమా ఇవ్వాలంటూ శేఖర్ కార్యాలయం చుట్టూ మూగారు. సినిమా బిజినెస్ పై అంతగా అవగాహన లేని ఈ సెన్సిబుల్ దర్శకుడు వారు ఎంత ఇస్తే అంత తీసుకొని సినిమాను ఇచ్చేశారు.
కొద్దిరోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆనంద్ సినిమాకు థియేటర్లు విపరీతంగా పెరిగాయి. సినిమా భారీ హిట్ అయింది. దీన్ని కొనుగోలు చేసినవారు భారీగా లాభపడ్డారు. రూ.2.30 కోట్ల బడ్జెట్ కు తనకు రూ.కోటి లాభం వచ్చింది. ఆనంద్ విడుదలైన రోజే చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైనంది. ఈ పోటీని తట్టుకొని ఆనంద్ ఘనవిజయం సాధించడం అనేది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
-
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
పెళ్లయ్యాక తొలి బర్త్డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్డ్రాప్లో విధ్వంసం -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్












Click it and Unblock the Notifications