తమన్నా కాళ్లు పట్టుకుంటా - సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు !!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందాల భామ, కెరీర్ ఆరంభం నుంచే స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు... జానర్ ఏదైనా సరే తమన్నా తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగులో సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోంది. గతేడాది 'ఓదెల 2' తో విజయాన్ని అందుకున్న తమన్నా.. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కోలీవుడ్‌లో విశాల్ నటిస్తున్న "పురుషన్" (తెలుగులో 'మొగుడు'గా డబ్బింగ్) సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ కలిసి నటిస్తున్న 'రేంజర్' మూవీలోనూ ముఖ్యమైన రోల్ చేస్తోంది. ఓటీటీ సిరీస్‌లలో కూడా బోల్డ్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేస్తోంది.

కాగా తమన్నా భాటియాపై సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంపై స్పందించిన అన్నూ కపూర్, అవసరమైతే తమన్నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
గతంలో అన్నూ కపూర్ ఇక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హోస్ట్ తమన్నా ప్రస్తావన తేవడంతో.. ఆమె డ్యాన్స్, అందంపై మాట్లాడారు. 'స్త్రీ 2'లోని 'ఆజ్ కీ రాత్' పాటలో తమన్నా ప్రదర్శన ఆకట్టుకుందని చెబుతూ "మాషా అల్లాహ్... క్యా దూధియా బదన్ హై" అని వ్యాఖ్యానించారు. దీనికి "మిల్కీ బ్యూటీ" అని అర్థం. అయితే ఆయన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు వాటిని అభినందనగా భావించగా, మరికొందరు మహిళల శరీరాకృతిపై బహిరంగ వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో వివరణిచ్చిన అన్నూ కపూర్, 'దూధియా బదన్' వ్యాఖ్యలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని, తనకు దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. వివాదం పెరగడానికి భాషా భేదమే కారణమని అన్నూ కపూర్ అభిప్రాయపడ్డారు. "నేను అదే మాటను ఇంగ్లిష్‌లో 'మిల్కీ బాడీ' అని చెప్పి ఉంటే అంత పెద్ద సమస్య అయ్యేది కాదు. కానీ హిందీలో చెప్పడంతో వేరే అర్థాలు తీసుకున్నారు" అని వివరించారు.












Click it and Unblock the Notifications