రాజమౌళి అయితే నాకేంటి..? తెలుగు హీరో సంచలనం
దర్శకుడు ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌లను సూపర్ స్టార్లను చేసిన ఘనత కచ్చితంగా రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయిన కలలు కంటారు. ఇక రాజమౌళి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే చాలు.. చాలా మంది హీరోలు తమ సినిమాను వాయిదా వేసుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం 'శ్రీమంతుడు' సినిమాను బాహుబలి కారణంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేయడానికి వెనకాడతారు.

అలాంటిది ఓ హీరో ఏకంగా రాజమౌళికి పోటీగా తన సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన 'బాహుబలి' సినిమాను రి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి' రెండు పార్టులను కలిపి విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఈ నెల 31న 'బాహుబలి ఎపిక్' విడుదల కానుంది. అయితే అదే రోజున మాస్ రాజా రవితేజ నటించిన 'మాస్ జాతర' సినిమా సైతం విడుదల కానుంది. మాస్ జాతర సినిమా కొత్తగా వస్తోన్న సినిమా అయినప్పటికీ, 'బాహుబలి' వంటి ఎపిక్ సినిమా విడుదల ఉన్న సమయంలో 'మాస్ జాతర' విడుదల చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. 'మాస్ జాతర' ఒక రోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందని కొందరు భావిస్తుండగా, 'బాహుబలి' వల్ల 'మాస్ జాతర సినిమాకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజమౌళి 'బాహుబలి' సినిమా రిలీజ్ ఉండగానే రవితేజ తన సినిమాను విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications