ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే డాక్యుమెంటరీ..కళ్లకు కట్టినట్టు చూపించారు
ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రియల్ డాక్యుమెంటరీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
రాయలసీమ ప్రాంత సంస్కృతికి అద్దం పట్టే ప్రొద్దుటూరు దసరా వేడుకల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుతమైన డాక్యుమెంటరీ ఇప్పుడు మీ ఇంటి ముంగిట ఉంది.'బాల్కనీ ఒరిజినల్స్' బ్యానర్ పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో రూపొందిన 'ప్రొద్దుటూరు దసరా' డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ కళాత్మక నేతృత్వంలో, నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల చొరవతో తెరకెక్కిన ఈ 40 నిమిషాల డాక్యుమెంటరీ... ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే పది రోజుల పండుగ సంరంభాన్ని, ఆచార వ్యవహారాలను, స్థానిక ప్రజల విశ్వాసాన్ని అత్యద్భుతంగా డాక్యుమెంట్ చేసింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా, అద్భుతమైన నిర్మాణ విలువలతో, సాంస్కృతిక లోతుతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
నవంబర్ 7 నుంచే ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ... పురాతన ఆలయాల శోభ, శక్తివంతమైన అమ్మవారి అలంకారాలు, ఘనంగా జరిగే ఉత్సవాల పరంపరను పరిచయం చేస్తుంది. దసరా పండుగను ఇంత ఘనంగా, ప్రత్యేకంగా జరుపుకునే ప్రొద్దుటూరు గొప్పదనాన్ని చూడాలంటే దీనిని తప్పక వీక్షించాల్సిందే.
ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ సర్కిల్స్ సంస్థ డిజిటల్ ప్రమోషన్స్ అందించారు. బాల్కనీ ఒరిజినల్స్ నిర్మించిన ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం అథారిటీ కూడా భాగమైంది. ఈ విజయంతో బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ పై భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్‌లో లేదా మీకు దొరికిన తీరిక సమయంలో, ఒకసారి రాయలసీమ సాంస్కృతిక వారసత్వంలో భాగమైన ప్రొద్దుటూరు దసరా వైభవాన్ని ఈటీవీ విన్‌లో చూసి ఆనందించండి.












Click it and Unblock the Notifications