సమంత నగ్న ఫొటోల లీక్ వెనుక ఉంది వాళ్లే
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించింది లేదు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు.సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. తన అనారోగ్యం గురించి సమంతనే పలుమార్లు చెప్పడం జరిగింది.
ఆరోగ్యం క్షీణించడంతోనే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు సమంత తెలిపింది. అయితే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె గతంలోనే చెప్పుకొచ్చింది. ఆదివారం ఈ చికిత్సకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత తనకు జరిగిన చికిత్స గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు.

ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే వైద్య విధానం, అధునాతన సాంకేతికతతో ఆరోగ్యాన్ని తిరిగి బూస్టప్ చేయడం ఎలానో సమంత ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కండరాల పనితీరు మెరుగవ్వడానికి అవసరమైన మెరుగైన చికిత్స ఇది. శరీరంలో కొవ్వును తగ్గించి, అనవసర కండపుష్టిని కరిగించి శరీరాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియ ఇది. అదనపు చెమటలు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గిస్తుందని సమంత వివరించింది. అయితే ఈ చికిత్సా విధానం గురించి వెల్లడించే క్రమంతో సమంత బాత్ టవల్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
దీన్ని కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది తెలియని చాలామంది సమంత నగ్న ఫొటోలంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకే ఇలా వేధింపులుఎదురవుతున్నాయంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. సమంత ప్రస్తుతం యూరప్ వెకేషన్‌లో ఉన్నారు. ఆమె తిరిగి ఇండియాకు రాగానే నగ్న ఫొటోలపై స్పందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications