నా ప్రియుడు ఒకేసారి ఐదుగురితో..సంచలన విషయాలు బయటపెట్టిన బ్యూటీ
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనాయా కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. లవ్‌లో తాను ఎదుర్కొన్న మోసం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనాయా కపూర్ తన తాజా చిత్రం 'తూ యా మై' ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ శనాయా ఆవేదన వ్యక్తం చేసింది. అతడు తనతో రిలేషన్‌లో ఉంటూనే మరో ఐదుగురు అమ్మాయిలతో అఫైర్ నడిపాడని ఆమె తెలిపింది.
రొమాంటిక్ వెకేషన్లో బయటపడిన అసలు నిజం
శనాయా తన ప్రేమ కథ విషాదాంతం గురించి వివరిస్తూ.. "మేమిద్దరం విదేశాల్లో వెకేషన్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా రిలేషన్ చాలా బాగుందని, నా లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకున్నాను. ఒకరోజు డిన్నర్‌కు వెళ్లే ముందు అతడు స్నానానికి వెళ్తూ.. క్యాబ్ బుక్ చేయమని తన ఫోన్ నాకు ఇచ్చాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ నుంచి రావడంతో నాకు అనుమానం వచ్చి చాట్ ఓపెన్ చేశాను" అని వివరించింది.

ఒకరు కాదు.. ఏకంగా ఐదుగురు!
చాట్ చూసిన శనాయా షాక్‌కు గురైంది. "మొదట ఒక అమ్మాయితో చాటింగ్ చూసి సర్దుకుందాం అనుకున్నాను. కానీ వెంటనే రెండో అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. అలా వరుసగా ఐదుగురు అమ్మాయిల మెసేజ్‌లు చూశాను. వారితో అతడు చేస్తున్న అసభ్యకరమైన చాటింగ్‌లు చూసి నాకు మాట రాలేదు. వెంటనే ఆ చాట్స్ అన్నింటినీ స్క్రీన్ షాట్స్ తీసి నా ఫ్రెండ్స్‌కు పంపాను" అని శనాయా చెప్పుకొచ్చింది.
అండగా నిలిచిన అనన్య పాండే
ఈ కష్ట సమయంలో తన ప్రాణ స్నేహితురాలు, నటి అనన్య పాండే తనకు ధైర్యం చెప్పిందని శనాయా తెలిపింది. "నేను ఆ విషయాన్ని అనన్యకు చెప్పగానే, ఆమె వెంటనే నన్ను అక్కడి నుంచి వచ్చేయమని చెప్పింది. కానీ నేను విదేశాల్లో ఉండటం వల్ల భయపడి, మరో మూడు రోజుల పాటు ఏమీ తెలియనట్టే అతడితో కలిసి ఉన్నాను. ఆ తర్వాత ఇండియాకు వచ్చాక అతడిని నిలదీశాను" అని పేర్కొంది.
అతడి వింత సమాధానం
నిజం బయటపడ్డాక ఆ యువకుడు శనాయాను ఖరీదైన ఇయర్ రింగ్స్ కొనిచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూశాడు. "నేను కేవలం మెసేజ్ మాత్రమే చేశాను కదా, శారీరకంగా ఎవరితోనూ కలవలేదు కదా.. ఇందులో పెద్ద తప్పేముంది?" అని అతడు వాదించాడట. దీనిని 'ఎమోషనల్ చీటింగ్' అంటారని, ఇది శారీరక మోసం కంటే దారుణమని ఆమె అతడికి గట్టిగా బుద్ధి చెప్పి బ్రేకప్ చెప్పేసింది.












Click it and Unblock the Notifications