"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్"
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి నారీనారీ నడుమ మురారీ చిత్రంతో హిట్ కొట్టిన ఈ ఛార్మింగ్ స్టార్.. మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'బైకర్' పేరుతో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ట్రైలర్ చాలా అద్భుతంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ట్రైలర్ లో బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా సాగాయి.
ఈసారి బంపర్ బ్లాకబస్టర్ కొడుతున్నాం #Biker తో - @ImSharwanand 🥁🥁🔥
— Andhra Talkies (@AndhraTalkie) March 22, 2026
pic.twitter.com/qJ2GCbFWQr
ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకులుగా రాజశేఖర్, శర్వానంద్ స్క్రీన్ షేరింగ్ చాలా బాగుంది. 'బైకర్' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీలో శర్వానంద్ సరికొత్త లుక్ లో కనువిందు చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పాడు. "మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" అని అన్నాడు. దాంతో శర్వానంద్ ఫ్యాన్స్ విజిల్స్, కేరింతలు కొట్టారు.

ఇక 'బైకర్' మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీతోపాటు శర్వానంద్..'భోగి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలోనూ శర్వానంద్ ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications