Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బట్టలు లేకుండా నగ్నంగా హీరో చైతన్య.. షాకిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..!

టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దిల్ దియా'. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్ లో హీరో చైతన్య బట్టలు లేకుండా సోఫాలో కూర్చోవడం షాకింగ్ గా ఉంది. ఈ క్రేజీ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. పోస్టర్ చాలా ఇంటెన్స్ అండ్ డీప్ గా ఉందని ట్వీట్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్ లో ఇటీవల వైవిధ్యభరితమైన సినిమాలు చాలానే వస్తున్నాయి. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్ లేకపోతే స్టార్ హీరో సినిమా అయినా పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వినూత్నమైన కథాంశంతో వచ్చిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు హిట్ సాధించాయి. అయితే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. హీరో చైతన్య రావు మదాడితో ఈ మూవీ తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పారు.

ఈ కొత్త సినిమా పేరును 'దిల్ దియా' గా ఖరారు చేశారు. అంతేకాక ఈ టైటిల్ కు ఏ నేకెడ్ ట్రూత్' అనే పవర్ ‌ఫుల్ ట్యాగ్‌ లైన్‌ ను కూడా జోడించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో బట్టలు లేకుండా సోఫాలో కూర్చున్నట్లుగా హీరో చైతన్య కనిపిస్తున్నారు. పూర్తిగా రా అండ్ రూటెడ్ లుక్‌ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ ను విడుదల చేయడంతో.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Shocking Bold Move Chaitanya Rao Goes Completely Nude in Dil Diya A Naked Truth First Look Poster

ఇక ఈ మూవీని పూర్ణ నాయుడు ప్రొడక్షన్, శ్రియాస్ చిత్రాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+