అరెరే... సమంత ఔట్.. శ్రుతిహాసన్ ఓకే!
సుమారు మూడు సంవత్సరాల క్రితం అంటే... 2021 చివరలో ప్రముఖ స్టార్ కథానాయిక సమంత ఒక అంతర్జాతీయ సినిమాలో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కనుంది. ఈ ఇంగ్లిషు సినిమాలో సామ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
కాలక్రమంలో ఈ సినిమా ఒకటుందని సినీ జనాలు మరిచిపోయారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి సమంత తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సామ్ స్థానంలో శ్రుతిహాసన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నై స్టోరీ అనే టైటిల్ ను ఖరారు చేవారు. వివేకా్ కాల్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర బై సెక్స్యువల్ అని ప్రచారం జరిగింది. ఇటీవలే సలార్ సీజ్ ఫైర్ తో హిట్ అందుకున్న శృతిహాసన్ అడవి శేషు నటిస్తున్న డెకాయిట్ లో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా సమంత ఈ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవడంతో అనూహ్యంగా శ్రుతికి కలిసివస్తుంది.
మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత తాజాగా సినిమాల్లో నటించే విషయమై దృష్టిసారించింది. తాజాగా కొన్ని కథలను వింటోంది. ఇటీవలే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా ప్రతిభావంతులైన కొత్తతరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications