అతనితో కలిసి బెడ్‌పై రెచ్చిపోయిన శృతి హాసన్..బోల్డ్ కాదు..అంతకు మించి
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇదే సమయంలో తమిళంలో సూర్య, విశాల్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. శృతి హాసన్ ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. 'ది ఐ' అనే హాలీవుడ్ మూవీ చేస్తోంది శృతి హాసన్. సైకలాజికల్ త్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు.తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో శృతి హాసన్ చాలా బోల్డ్‌గా కనిపించింది.ప్రియుడుతో ఘాటు రొమాన్స్ చేస్తోన్న ప్రియురాలు పాత్రలో శృతి హాసన్ కనిపించింది.

బెడ్‌పై రెచ్చిపోయిన సీన్లు సినిమాలో చాలానే ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.హ్యాపీగా బోయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ లైఫ్ ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. అంతేకాదు ఎవరో తనని చూస్తున్నట్టు ఆమెకు అనిపిస్తుంటుంది. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది.. దీని వెనుక ఉన్నది ఎవరు.. వాటికి కారణాలు ఏంటి తెలియాలంటే 'ది ఐ' చూడాల్సిందే. 'ది ఐ' సినిమాలో మార్క్ రౌలే శృతికి జోడీగా నటిస్తున్నాడు.ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే..తెలుగులో సలార్-2 సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తోంది.












Click it and Unblock the Notifications