ఆ హీరోను గట్టి దెబ్బ కొట్టిన శృతి హాసన్ ..!
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది.స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది.

శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చింది.
శృతి హాసన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారింది. అయితే ఆమె తాజాగా తెలుగు సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అడవి శేష్ -శృతి హాసన్ కాంబినేషన్‌లో డెకాయిట్ మూవీ తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుందని తెలుస్తోంది. డేట్స్ ఇష్యూ వల్ల శ్రుతి హాసన్ డెకాయిట్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చిత్ర దర్శకుడు షనైల్ డియో వ్యక్తిగత కారణాలతో సినిమా ఆలస్యం కావడంతో డేట్స్ సర్దుబాటు చేయలేక అడవి శేష్ సినిమా శృతి హాసన్ నుంచి తప్పుకుందని సమాచారం. శృతి హాసన్ తప్పుకోవడం డెకాయిట్ మూవీకి గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి.












Click it and Unblock the Notifications