Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Silk Smitha:మత్తెక్కించే కళ్లు, మైమరిపించే అందం..నేటికీ వీడని డెత్ మిస్టరీ..!

సిల్క్ స్మితా... ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన బ్యూటీ. కెరీర్ పీక్‌ స్టేజెస్‌లో ఉండగా హఠాత్తుగా అందరికీ దూరమైన తార. అవును సిల్క్ స్మితా దూరమై నేటికి 27 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆమె నటించిన చిత్రాలు, ఆమె పోషించిన పాత్రలు ఇంకా సినీ అభిమానుల కళ్లముందే తచ్చాడుతున్నాయి. సిల్క్ స్మితా ఎన్నో ఒడిదుడుకుల మధ్య సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది.

విజయ లక్ష్మీ నుంచి సిల్క్ స్మితాగా: సిల్క్ స్మితా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో 1960 డిసెంబర్ 2వ తేదీన జన్మించింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మీ. కుటుంబ కష్టాలు, పేదరికంతో స్కూలు చదువును మధ్యలోనే మానేసింది. దీంతో 14 ఏళ్ల వయసులోనే విజయలక్ష్మీకి పెళ్లి జరిగింది.అయితే అత్తారింట్లో ఎన్నో వేధింపులకు గురైంది. అవమానాలకు లోనైంది.

Its been 27 years that actress Silk Smitha had left the world

ఇక అక్కడే ధైర్యం చేసి ఇంట్లో నుంచి పారిపోయి చెన్నైకు చేరుకుంది. ముందుగా ఒక నటి దగ్గర మేకప్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇలా ఆమెను ఓ మళయాలీ డైరెక్టర్ ఆంథోనీ గుర్తించాడు. ఇనయే థేడీ అనే చిత్రంలో సిల్క్ స్మితాకు ఛాన్స్ ఇచ్చాడు.ఆయనే విజయలక్ష్మీ పేరును స్మితాగా మార్చాడు. అయితే ఆ సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది.

సిల్క్ స్మితాకు బ్రేక్ ఇచ్చింది ఆ సినిమానే: అయితే సిల్క్ స్మితాకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తమిళ డైరెక్టర్ విను చక్రవర్తి. స్మితాను చూసిన విను చక్రవర్తి ఫిదా అయ్యాడు. ఆమె మత్తు కళ్లకు పడిపోయాడు. వెంటనే తన చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలని భావించి ఆమె బాధ్యతలను ఆయనే తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు.

చక్రవర్తి భార్య స్మితాను సినిమా ఇండస్ట్రీకి తగ్గట్టుగా తర్ఫీదు ఇచ్చింది. అంటే ఇంగ్లీషులో మాట్లాడటం నేర్పించింది. డాన్స్‌లో కూడా శిక్షణ ఇప్పించింది. అయితే సిల్క్ స్మితాలో ఉన్న సెక్స్ అప్పీల్‌తో ఆమెకు ఎక్కువగా ఐటెం సాంగ్స్, క్యాబ్రెట్ డ్యాన్స్ పాత్రలు వచ్చాయి. ఇక్కడే ఆమె కెరీర్‌ ఓ మలుపు తిరిగింది.

Silk Smitha:Remembering this great south Indian actress on her 27th death anniversary

తొలి తమిళ చిత్రం వందిచక్కరంలో స్మితా సిల్క్ పేరుతో పాత్ర పోషించింది. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది. దీంతో ఈ చిత్రంలోని పాత్ర సిల్క్‌ను స్మితా ముందు జోడించడంతో స్క్రీన్ నేమ్ కాస్త సిల్క్ స్మితాగా మారింది. ఇక అప్పట్లో విడుదలైన సినిమాలో సిల్క్ స్మితా పాత్ర లేకుండా నడిచేవి కావు. సినిమా స్టోరీ అంతంతమాత్రంగానే ఉన్నా కేవలం సిల్క్ స్మితాను తెరపై చూసేందుకు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు.

దీంతో ఆమె నిర్మాతల గోల్డెన్ డక్‌గా మారింది. అందుకే కథ బలహీనంగా ఉన్నప్పటికీ సిల్క్‌స్మితా ఫ్లేవర్‌ను దర్శకులు యాడ్ చేసేవారు. ఇలా సిల్క్ స్మితా తెలుగు తమిళం,మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించింది. అయితే ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ సిల్క్ స్మితాకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఆమె ఏనాడు అవార్డుల కోసం పాకులాడలేదు కూడా.

Silk Smitha 27th death anniversary

అప్పట్లోనే బికినీతో బోల్డ్ షో: ఇక అప్పట్లో స్కిన్ షో చేయాలంటే హీరోయిన్లు భయపడేవారు.చీరలు, సల్వార్ ఖమీజ్ ధరించే రోజుల్లోనే బికినీ ధరించి కుర్రాళ్లకు మతిపోయేలా చేసింది సిల్క్ స్మితా.తన బోల్డ్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిల్క్ సినిమా అంటే అది హిట్టే అన్నట్లుగా పేరు సంపాదించింది. మత్తెక్కించే కళ్లతో శృంగార దేవతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది సిల్క్ స్మితా. అన్ని పరిశ్రమల్లోని అగ్రహీరోల సరసన సిల్క్ స్మితా నటించింది.

ఆమె పెదాలపై ఉండే చిరునవ్వు తరాలను కట్టిపడేసింది. 1980 నుంచి ఇప్పటి వరకు సిల్క్ స్మితా తర్వాత మగవారిని ఇలా లవ్‌లో దించేసిన ఒక తార కూడ కనిపించదు. ఆ రోజుల్లో తెల్లతోలు ఉంటేనే గుర్తించేవారు. కానీ దక్షిణాది నుంచి వచ్చిన సిల్క్ స్మితా బ్రౌనిష్ స్కిన్‌తో సినీ ఇండస్ట్రీని ఏలింది.

Silk Smitha 27th death anniversary

వీడని సిల్క్ డెత్ మిస్టరీ: తాను చేసే బోల్డ్ షోపై పలువురు పలురకాలుగా మాట్లాడుకున్నప్పటికీ సిల్క్ స్మితా డోన్ట్ కేర్ అన్నట్టుగానే ఉండేది. స్క్రీన్ పై సెక్సీ క్వీన్‌గా కనిపించినప్పటికీ నిజజీవితంలో మాత్రం సిల్క్ స్మితా చిన్నపిల్లలా ఉండేదని చెబుతారు.అయితే ఎప్పడూ తన చుట్టూ మగవారిని ఎంటర్‌టెయిన్ చేసేది కాదట. ఇక తన స్నేహితురాలి కోసం సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మితా.. చాలా నష్టపోయిందట. ఎవరినీ ఆదుకోమని కూడా అడగలేదట.

1996 సెప్టెంబర్ 22 రాత్రి సిల్క్ స్మితా తన స్నేహితురా ఫోన్ చేసి ఏదో మాట్లాడాలని చెప్పిందట.మర్నాడు ఉదయం సెప్టెంబర్ 23న అక్కడికి వెళ్లేసరికి సిల్క్ స్మితా హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అయితే తన మృతికి కారణాలు ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సిల్క్ స్మితా శరీరంలో ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉండటంతోనే మృతి చెంది ఉంటుందంటూ ఓ నివేదిక కొన్ని నెలల తర్వాత బయటకొచ్చింది. అంతేకాదు పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అది స్పష్టత లోపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+