పైసలిస్తా నాతో ప****వా..? సింగర్‌కు నెటిజన్ షాక్

ఏ రంగంలో ఉన్న మహిళలకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. అన్ని రంగాల్లో మహిళల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. మహిళలకు ఎదురువుతున్న వేధింపులు చాలావరకు బయటకు రానివ్వకుండా మ్యానేజ్ చేస్తున్నారనే అపవాదు ఉంది. గ్లామర్ ఫీల్డ్‌లో అయితే లైంగిక వేధింపులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

sexual harassment

సినీ నటుల జీవితంలో అయితే ఈ వేధింపులు సంఖ్య కాస్తా ఎక్కువుగానే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎదురువుతున్న వేధింపులపై కొందరు భారీ ఎత్తున ఉద్యమించిన సంగతి అందరికి తెలిసిందే. వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో సింగర్ చిన్మయి కూడా ఒకరు. అలాంటి చిన్మయికి సైతం వేధింపులు తప్పలేదు.

 sexual harassment

తాజాగా ఓ నెటిజన్ చిన్మయిని అసభ్యకరంగా మేసేజ్‌లు పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే..గత కొద్దికాలంగా చిన్మయికి సోషల్ మీడియాలో మేసేజ్‌లు పెడుతున్నాడట ఓ నెటిజన్. అయితే చిన్మయి వాటికి రిప్లై ఇవ్వకపోవడంతో.. సదరు నెటిజన్ అసభ్యకరంగా మేసేజ్‌లు పెట్టడం మొదలుపెట్టాడట. నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను నాతో పడుకుంటావా? నీకు లగ్జరీ లైఫ్, కావాల్సిన జీవితం ఇస్తాను అంటూ తనలోని వక్ర బుద్దిని బయటపెట్టాడు.

singer chinmayi facing sexual harassment on social media

ఆ నెటిజన్ చేసిన చాటింగ్‌‌ను చిన్మయి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారంటూ మండిపడింది. మంచి వారితో పాటు.. ఇలాంటి చెడ్డవారు కూడా మన జీవితంలో ఎదురువుతుంటారని.. ఇటువంటి వారితో తగు జాగ్రత్తతో ఉండాలని అమ్మాయిలకు చిన్మయి సూచించారు. చిన్మయిని మొదటి నుంచి కూడా వివాదాలు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమాజంలో ఆడవాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా చిన్మయి స్పందిస్తుంటారు.

మహిళలకు అండగా ఆమె పోరాడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన పోరాటం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వైరముత్తు తనకున్న పలుకుబడితో ఎందరో అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పి చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీ చిన్మయిని బ్యాన్ కూడా చేసింది. అయినప్పటికీ ఆమె తన పోరటాన్ని ఆపింది లేదు. ఆ మధ్య సీఎం స్టాలిన్‌ను నేరుగా వెళ్లి కలిసి మరి వైరముత్తుపై ఫిర్యాదు చేసింది. అలాంటి చిన్మయికి సైతం సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులు తప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+