మార్ఫింగ్ ఫోటోలపై చిన్మయి షాకింగ్ కౌంటర్.. పచ్చి బూతులంటూ !!
సింగర్ చిన్మయి.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ సమంత, లావణ్య త్రిపాఠి సహా పలువురు హీరోయిన్స్ ఆమె డబ్బింగ్‌తోనే ఆడియన్స్‌కి మరింత చేరువయ్యారు. అంతే కాకుండా ఆమె నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్ర భార్య అని అందరికీ తెలిసిందే. కాగా సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
గతంలో లైంగిక వేధింపుల గురించి చిన్మయి పెద్ద పోరాటమే చేస్తోంది. అందుకే ఫెమినిస్ట్ అంటూ ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. అయితే ట్రోలింగ్ ని కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ రియాక్ట్ అవుతూ ఉంటారు. కాగా రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ టైంలో చిన్మయి.. ఆమె భర్త రాహుల్ ట్రోలింగ్ కి గురయ్యారు. మంగళ సూత్రంపై రాహుల్ రవీంద్రన్ మాట్లాడిన వీడియోపై దారుణమైన కామెంట్లు చేశారు. తన భర్త వ్యాఖ్యలకు చిన్మయి సపోర్టుగా రావడంతో.. ఆమెపై కూడా తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ స్పేస్ వేదికగా రాహుల్- చిన్మయి దంపతులను తీవ్రంగా విమర్శించారు. చిన్మయి లాంటి వారికి పిల్లలు పుట్టకూడదని, పుట్టినా వెంటనే చనిపోవాలని కామెంట్స్ చేశారు. రాయడానికి వీలుకాని తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు లేటెస్టుగా తన మార్ఫింగ్ ఫోటోలపై ఆమె రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.
కావాలనే తిడుతున్నారంటూ..
ఈ మేరకు చిన్మయి తన మార్ఫింగ్ ఫొటోను దాన్ని షేర్ చేసిన ఎక్స్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. దానిపై పోలీసులకు కంప్లయింట్ చేసినట్టు వెల్లడించారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని గత కొన్ని వారాలుగా తనని అసభ్యకరమైన పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ వీడియో షేర్ చేశారు. 'ల** ము** 'అని తిట్టే వ్యక్తుల నుంచి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడటానికి తాను ఈ వీడియో చేశానని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications