Mangli Marriage: పెళ్లి పీటలు ఎక్కనున్న మంగ్లీ- వరుడు ఆయనే

అమరావతి: జానపద గాయని మంగ్లీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి పీటలను ఎక్కనున్నారు మంగ్లీ. దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోన్నారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

లంబాడి సామాజిక వర్గానికి చెందిన గాయని మంగ్లీ. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం యాంకర్‌గా తన కేరీర్‌ను ఆరంభించారు. మ్యూజిక్‌పై ఆసక్తి ఉండటంతో సింగర్‌గా మారారు.

Mangli

జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్‌ను రూపొందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే బతుకమ్మ, సమ్మక్కసారక, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఆయా పండగల సమయాల్లో మంగ్లీ పాడిన పాటలు గ్రామగ్రామాన వినిపిస్తుంటాయి. ఈ ఆల్బమ్స్ ఆమెను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేేశాయి. ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడ్డారు. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్.. పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనపై మంగ్లీ కొన్ని పాటలు పాడారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న.. పాట సూపర్ హిట్‌గా నిలిచింది.

Mangli

తూరుపు దిక్కున భానుడు లేచే.. వంటి పాటలు ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్‌లల్లో ఈ పాట వినిపిస్తుంటుంది. ఆమె రూపొందించిన బోనాల్ 2023 ఆల్బమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. పలు భారీ బడ్జెట్ సినిమాలు చేతిలో ఉన్నాయి. త్వరలో అమెరికాలోనూ లైవ్ కన్సర్ట్ చేయబోతోన్నారు.

కాగా త్వరలోనే మంగ్లీ తన బావను పెళ్లి చేసుకుంటోన్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్ అన్నీ పూర్తి చేసుకున్న తరువాత పెళ్లి పనుల్లో నిమగ్నం అవుతారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+