సినిమా బాలేదన్నారు.. కలెక్షన్లు కుమ్మేస్తున్నాయిగా..!
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Kartikeyan) నటించిన 'మదరాసి' (Madharaasi Movie) చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మొదట పెద్దగా బజ్ లేకపోయినా, విడుదలైన తర్వాత ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
'మదరాసి' చిత్రం మూడో రోజు ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే వసూళ్లను సాధించింది. రెండో రోజుకు సమానమైన ట్రెండ్‌ను చూపిస్తూ, మూడో రోజున 60-65 లక్షల షేర్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఆధారంగా ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

తమిళంలో అయితే ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు. రెండో రోజు కంటే మూడో రోజు మరింత వృద్ధిని సాధించి, మరోసారి డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ మార్కెట్‌లో అద్భుతమైన జోరును చూపిస్తోంది.
ఓవరాల్‌గా, 'మదరాసి' చిత్రం మూడో రోజున ప్రపంచవ్యాప్తంగా మరోసారి 20 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిపోయే అవకాశం ఉంది. ఈ వీకెండ్‌లో సినిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్లు ఎంత ఉంటాయో చూడాలి. మొత్తంగా, తక్కువ బజ్ ఉన్నప్పటికీ, కంటెంట్ ఆధారంగా శివ కార్తికేయన్ 'మదరాసి' సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ దిశగా దూసుకుపోతోందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications