నాగచైతన్యతో నిశ్చితార్థం.. శోభిత అరుదైన ఘనత..
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభితా దూళిపాళ అరుదైన ఘనత సాధించారు. వీరిద్దరి నిశ్చితార్థం తర్వాత శోభితా గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు చాలామంది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. దీంతో ఈ బ్యూటీ ఈ వారం ఐఎమ్‌డిబి ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది నాగఛైతన్యకు కాబోయే భార్య శోభిత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో రెండ స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ మూవీస్ డేటాబేస్ ఈ వారం అత్యంత ప్రజాదారణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో హీరోయిన్ శార్వరీ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, సెకండ్ ప్లేస్‌లో శోభిత ధూళిపాళ నిలిచారు. ముంజ్యా చిత్రం విడుదల అనంతరం ఐఎమ్‌డిబి బ్రేక్‌అవుట్ స్టార్‌మీటర్ అవార్డును గెలుచుకోవడంతో నటి శార్వరీ మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం శోభిత దూళిపాళ రెండో స్థానంలో నిలవగా, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు స్థానంలో కాజల్, ఐదో స్థానంలో జాన్వీకపూర్‌లు నిలిచారు. వీరితోపాటు లక్ష్య, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ ఈ వారం టాప్ 10లో స్థానాల్లో నిలిచారు.
2022 నుంచి డేటింగ్‌లో..
నటుడు నాగచైతన్య, శోభిత దూళిపాళ లు 2022 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, గత గురువారం వీరిద్దరూ నిశ్చితార్థంతో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేశారు. ఎంగేజ్‌మెంట్ అనంతరం శోభిత ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఓ కొటేషన్ కూడా షేర్ చేసింది. ఇక, ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో సినిమాల్లోనూ నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications