సంచలన విషయాలను బయటపెట్టిన శోభిత ధూళిపాళ

సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది.

నాగ చైతన్యతో రిలేషన్‌ గురించి చెబుతూ.. వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శోభిత. మనిద్దరం ఎలా కలిశాము అన్నది ముఖ్యం కాదు.. పరిచయం ఎలా మొదలయినా.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చిన శోభిత.. నిశ్చితార్థం సందర్భంగా దిగిన కొన్ని క్యూట్‌ ఫొటోలను ఈ సందర్భంగా షేర్‌ చేసింది. శోభిత తాజాగా తన ఇన్ ‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. తాజా ఈ భామ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Sobhita Dhulipala revealed sensational things

తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. నేను నల్లగా ఉండడంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చానని శోభిత తెలిపారు.నెమ్మది నెమ్మదిగా ఈ విషయాలన్నీ పక్కనపెట్టి అందం అనేది మ్యాటర్ కాదని ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్‌కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని తెలిపారు.

ఇలా బాలీవుడ్ సినిమా అవకాశం వచ్చిన తర్వాత ఏ షాంపూ కంపెనీ అయితే నన్ను ఆడిషన్స్‌లో అవమానించి రిజెక్ట్ చేసిందో అదే షాంపూ కంపెనీ తన సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయాలని నన్ను కోరారని ఈ సందర్భంగా శోభిత చెప్పుకొచ్చింది. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, తెలుగు, తమిళ, హిందీ బాషాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+