సమంతకు శోభిత ధూళిపాళ గట్టిగానే కౌంటరిచ్చిందిగా..!
హీరో నాగ చైతన్యతో శోభితా ధూళిపాళ ప్రేమయాణం గురించి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
పెళ్లి విషయంలో శోభిత ధూళిపాళ చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు.

శోభిత ధూళిపాళ తన హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తోన్న ఫొటోలను శోభిత షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని రెడీ అయ్యింది. సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్‌లకు డిజైనర్ల చేత శారీలు, డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటారు. అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నప్పటికీ శోభిత సింపుల్‌గా చెల్లెలతో కలిసి సింపుల్‌గా షాప్‌కు వెళ్లి మరీ చీరను కొనుగొలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలియజేశారు.
పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ చీర తీసుకున్నారని తెలుస్తోంది.అంతే కాకుండా బంగారు జరీ వర్క్‌తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకోబోతుంది. ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది.దానికి ప్రత్యేకంగా డిజైనింగ్ హంగులు లేకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. గతంలో సమంత పెళ్లి సమయంలో స్పెషల్ డ్రెస్సులు, చీరలు డిజైన్ చేయించుకుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆ డ్రెస్సులను మొత్తం ఛేంజ్ చేసేసింది. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికే శోభిత ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications