చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు మామా.. దిష్టి తీయించుకోండి
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు.పెళ్లి తర్వాతనే శోభిత ధూళిపాళ గురించి ఎక్కువ చర్చ సాగింది. సమంత కంటే శోభిత ధూళిపాళ ఏం అందంగా లేదనే విమర్శలు వినిపించాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను నోటితో కాకుండా తన ప్రవర్తనతో జవాబిచ్చింది శోభిత.

బాలీవుడ్‌లో శోభిత చేసిన సినిమాలు, ఫొటోషూట్‌లు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సమంతతో పోల్చితే శోభిత అక్కినేని కోడలిగా సరిపోదనే అభిప్రాయం మొదట్లో బలంగా వినిపించింది. సమంత అభిమానుల నుంచి శోభిత తీవ్రమైన ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంది. అయితే, పెళ్లి ఘనంగా జరిగిన తర్వాత శోభితలో వచ్చిన పరివర్తన అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
అచ్చమైన తెలుగింటి కోడలిగా తనను తాను మలుచుకుంటున్న విధానం ఆమెపై ఉన్న నెగెటివ్ అభిప్రాయాన్ని క్రమంగా తొలగిస్తోంది. భర్త కోసం వంట చేయడం, ఎయిర్‌పోర్ట్‌లో చైతన్య కోసం వేచి ఉండటం వంటి ఘటనలతో ఆమెలోని సాధారణ గృహిణి కనిపిస్తోంది. ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో, అక్కినేని ఇంటి ఫంక్షన్లలో శోభిత డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా చీర కట్టుతో నిండుగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది.
తాజాగా దీపావళి వేడుకలో శోభిత అభిమానులకు కనుల విందు చేసింది. పెళ్లి తరువాత జరుపుకుంటున్న తొలి దీపావళి వేల వైలెట్ రంగు కుర్తాలో సింపుల్‌గా బ్రైట్‌గా కనిపించింది. భర్త నాగ చైతన్యతో అందంగా కనిపించింది. కళ్లు తిప్పుకోలేనంత అందంగా శోభిత కనిపించింది. ఈ దంపతులు దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చైతూ సతీమణి శోభిత ధూళిపాళ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications