'కాంతార' మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా..? మంచి ఛాన్స్ మిస్..!

భారతీయ చిత్ర సీమలో కాంతార చిత్రానికి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక కన్నడ ఇండస్ట్రీ గర్వించదగ్గ చిత్రాల్లో కాంతార ఒకటిగా నిలుస్తుంది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైంది. రూ. 400 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడీ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 మూవీ థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ మూవీ రూ. 65 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది. అటు బుక్ మై షో లోనూ నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ఈ మూవీకి కథ రాసుకున్న రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా చేయాలని అనుకోలేదట. దర్శకత్వం వరకు చూసుకుంటే చాలని అనుకున్నారట. ఆయన ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని భావించారట. అయితే ఓసారి ఎన్టీఆర్ ని కలిసి ఈ సినిమా స్టోరీని వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందట కానీ, అదే సమయంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో ఉండడం, తదుపరి చిత్రం దేవర కు కూడా డేట్స్ ఇచ్చేయడం కారణంగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వదులుకోవాల్సి వచ్చిందట. ఈ మూవీని ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేదని సామాజిక మాధ్యమాల్లో టాక్ వినిపిస్తోంది.

Social Media Abuzz Did Junior NTR Miss Out on Starring in Kantara

ఎన్టీఆర్ ఇలాంటి కథలకు తనదైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. అలాంటి అనుభవం ఉన్న నటుడు ఈ సినిమా చేసుంటే ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేదోనని నెట్టింట పలువురు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు అటు కర్ణాటక లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+