గొడవలొద్దు బ్రో.. ఎప్పటిలాగే "ఖడ్గం" సినిమాతో కానిచ్చేద్దాం..!
చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా ఆగస్టు 14న సూపర్ స్టార్ రజనీ కాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో వచ్చిన కూలీ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున సైమన్ అనే కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన వార్-2 కూడా విడుదలైంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
Em antaru mawaa..😂😂#War2 #CoolieFDFS #War2Celebrations #CoolieThePowerHouse #CoolieDisaster #khadgam pic.twitter.com/FTXm3PgVgZ
— TEJA PAVAN KALYAN K (@iamtpk03) August 14, 2025
ఈ మూవీస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్నాయి. మరి వీకెండ్ అయ్యే సరికి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందో చెప్పలేం. రెండు సినిమాలు కూడా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీస్ కు వీకెండ్ వరకూ భారీగానే లాభాలను అందుకుంటుంది. అయితే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ మూవీస్ పై ట్రోల్ గట్టిగానే నడుస్తున్నాయి.

వార్-2 , కూలీ రెండూ కూడా డబ్బింగ్ మూవీస్ కావడంతో డబ్బింగ్ మూవీస్ ను ఎంకరేజ్ చేసే బదులు మన ఖడ్గం మూవీ చూద్దాం అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. చిన్న పిల్లల్లా గొడవలొద్దు.. మెచ్యూర్ గా ఆలోచిద్దాం.. మనం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలం.. డబ్బింగ్ మూవీస్ ను ఎంకరేజ్ చేసే బదులు మన ఖడ్గం మూవీ చూద్దాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Friends arguing #coolie or #war2
— చంటిగాడు లోకల్ 😎 (@Harsha_offll) August 13, 2025
Me settled with #khadgam on 🥳♥️@GeminiTV@RaviTeja_offl #Raviteja #Massjathara pic.twitter.com/BqzCEbTyRo
ఒరేయ్ నవ్వు ఆగలేదు ,,😂😂#coolie #WAR2OnAug14th #Khadgam pic.twitter.com/6L0mLVrXy1
— Cult (@Cult277732595) August 12, 2025
మరికొంత మంది కిడ్స్ కూలీ చూస్తారు.. మెన్ వార్-2 చూస్తారు.. లెజెండ్స్ ఖడ్గం చూస్తారు. అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఫ్రెండ్స్ కూలీ లేదా వార్-2 అంటూ గొడవలు పడుతుంటే తాను కూల్ గా జెమినీలో ఖడ్గం సినిమా చూస్తానంటూ మరొకరు ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications