సౌత్‌లో అవమానం.. బాలీవుడ్‌లో గెలుపు: స్టార్ హీరోయిన్ రివెంజ్ స్టోరీ!

Isha Koppikar:"ఖల్లాస్ గర్ల్"గా గుర్తింపు పొందిన నటి ఈశా కొప్పికర్.. తన కెరీర్ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించారు. ఒక కొరియోగ్రాఫర్ ఆమె డ్యాన్స్ నైపుణ్యంపై అందరి ముందు అవమానకరంగా మాట్లాడిన సంఘటన ఆమెను ఎంతగానో బాధపెట్టింది. అయితే ఆ బాధను ఈశా కొప్పికర్ ఒక సవాలుగా తీసుకుని డ్యాన్స్ నేర్చుకుని విజయం సాధించారు.

కెరీర్ ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవం
ఈశా కొప్పికర్ తన నటనా జీవితాన్ని దక్షిణ భారత చిత్ర పరిశ్రమతోనే ప్రారంభించారు. తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో 'ఫిజా' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడారు. "నా కెరీర్ అప్పుడే ప్రారంభమైంది. ఒక సౌత్ సినిమా సెట్‌లో నేను ఉన్నప్పుడు, కొరియోగ్రాఫర్ అందరి ముందు నన్ను అవమానించాడు. సౌత్ డ్యాన్స్ స్టైల్స్ కష్టం అని మీకు తెలుసు. కానీ, నా మొదటి చిత్రంలోనే, అతను నా దగ్గరికి వచ్చి 'ఈ బాలీవుడ్ అమ్మాయిలు ఎందుకొస్తారో తెలియదు, వీళ్లకు ఏమీ రాదు' అని అన్నాడు. అతను నన్ను చాలా అవమానించాడు. 'డ్యాన్స్ రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు?' అని కూడా ప్రశ్నించాడు" అని ఈశా గుర్తు చేసుకున్నారు.

South Industry Insult to Bollywood Success Isha Koppikar s Revenge Story

ఆ మాటలు విని ఈశా కొప్పికర్ చాలా బాధపడ్డారు. అందరి ముందు అవమానం భరించలేక మేకప్ రూమ్ లోకి వెళ్లి ఈశా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆమె అక్కడితో ఆగిపోకాటుండా ఆ అవమానాన్ని ఒక ప్రేరణగా తీసుకున్నారు. "నేను తిరిగి దక్షిణాదికి వచ్చినప్పుడు, డ్యాన్స్ నేర్చుకుని వస్తానని, మళ్లీ ఎవరినీ ఇలా మాట్లాడనీయను" అని ఆమె తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నారు.

"ఖల్లాస్"తో స్టార్‌డమ్
ఈ సంఘటన తర్వాత ఈశా కొప్పికర్ డ్యాన్స్ పై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రఖ్యాత కొరియోగ్రాఫ్ సరోజ్ ఖాన్ అసిస్టెంట్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి తన నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. ఆ కృషి ఫలితంగానే ఈశా కొప్పికర్ 'కంపెనీ' సినిమాలో 'ఖల్లాస్' అనే ఐటెం సాంగ్ చేశారు. ఆ పాట అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆ ఒక్క పాటతో ఈశా కొప్పికర్ రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అప్పటి నుండి ఈశా కొప్పికర్‌ను ఇప్పటికీ అభిమానులు 'ఖల్లాస్ గర్ల్' అని ముద్దుగా పిలుస్తారు.

ఈశా కొప్పికర్ ప్రస్తుత కెరీర్
ఈశా కొప్పికర్ ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్‌లు, దక్షిణాది సినిమాలపై దృష్టి సారించారు. ఆమె గత మూడు సంవత్సరాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. 2024లో ఆమె ఒక తెలుగు చిత్రంలో నటించారు. అలాగే 'దహనం', 'ఫిక్సర్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+