Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తండ్రితో ఎఫైర్ పెట్టుకుని, కొడుకుతో వివాహం .. తెలుగు హీరోయిన్ సంచలనం

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్‌ చేసి, మరొకరిని వివాహం చేసుకున్న వారే. అయితే ఓ హీరోయిన్ తండ్రితో ఎఫైర్ నడిపి, కొడుకుని వివాహం చేసుకోవడానికి రెడీ అయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. అలనాటి నటి సిల్క్ స్మిత.

ఈ తరం ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, 1980ల్లో సిల్క్ స్మిత పేరు ఓ సంచలనం. స్టార్ హీరోలకు ధీటుగా ఆమె క్రేజ్ ఉండేది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషలలో 200 గంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించింది.ఆమె 1979లో తమిళ చిత్రం "వండిచక్రం"తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

special story on silk smitha death

మత్తెక్కించే అందంతో సిల్క్ స్మిత ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఐటెమ్ సాంగ్స్, వ్యాంప్‌ రోల్స్, బోల్డ్ గా ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించింది సిల్క్ స్మిత. ఆమె కోసం మాస్‌ ఆడియెన్స్ క్యూలు కట్టేవారు. ఆమె కోసమే సినిమాలకు వచ్చే వారు కోట్ల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె 1980 - 1990లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా ఎదిగింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా ఆమె వార్తల్లో నిలిచారు.సిల్క్ స్మిత రాధాకృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. డాక్టర్‌గా ఉన్న రాధాకృష్ణ సిల్క్ స్మితకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవారు.

తనకు తెలిసిన వ్యక్తి, దగ్గరి ఊరు అనే భావనతో ఆయన్ని సిల్క్ స్మిత తన దగ్గరే పెట్టుకుంది. కానీ అతను సిల్క్ స్మిత డబ్బు మొత్తం కాజేసేవాడట. అయితే రాధాకృష్ణ కొడుకుని పెళ్లి చేసుకుని ,పిల్లలను కనాలని, తనకంటూ ఓ ఫ్యామిలీని ఉండాలని బావించారట సిల్క్ స్మిత.దీనికి రాధాకృష్ణ అడ్డు పడటంతో గొడవలు ప్రారంభమయ్యాయని, చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సిల్క్ స్మిత సన్నిహితురాలు, సినీ నటి జయశీల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.సిల్క్ స్మిత జీవితంపై "ది డర్టీ పిక్చర్" అనే చిత్రం కూడా విడుదలయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+