మెంటల్ మాస్ కాంబో ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. వెంకీ మూవీలో 'నారా హీరో' !

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47". ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వెంకీ - త్రివిక్రమ్ కాంబోలో మూవీ ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. వెంకటేష్ తో కుటుంబ కథాచిత్రం.. అందుకు తోడు త్రివిక్రమ్ మేకింగ్, డైలాగ్స్ అంటే పక్కా బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నారు. అలానే ఈ చిత్రంలో వెంకీకి జోడిగా అందాల నటి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కీలక దశలో షూటింగ్ జరుపుకుంటోంది.

speculations-about-nara-rohith-acting-in-venkatesh-and-trivikram-movie

నారా రోహిత్ ఎంట్రీ..

కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో నారా రోహిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కథ విన్న వెంటనే ఆ పాత్ర నచ్చడంతోనే నారా రోహిత్ ఈ సినిమాకు ఓకే చెప్పారని.. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

త్రివిక్రమ్ సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు..

అయితే త్రివిక్రమ్ సినిమాల్లో ప్రధాన హీరోతో పాటు మరో బలమైన పాత్ర ఉండటం ఆయన ట్రేడ్‌మార్క్‌గా మారింది. గతంలో S/o సత్యమూర్తిలో శ్రీవిష్ణు.. అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టి.. అరవింద సమేత వీర రాఘవలో నవీన్ చంద్ర.. అల వైకుంఠపురంలో సుశాంత్.. గుంటూరు కారంలో రాహుల్ రవీంద్రన్.. ఇలా వరుసగా పలువురు నటులు కథకు కీలక బలం ఇచ్చారు.

speculations-about-nara-rohith-acting-in-venkatesh-and-trivikram-movie

ఇప్పుడు అదే తరహాలో ఈ చిత్రంలో కూడా నారా రోహిత్ కూడా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అభిమానులు ఊహిస్తున్నారు. ఇక నారా రోహిత్ కెరీర్ విషయానికి వస్తే.. విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన 'భైరవం', 'సుందరకాండ' వంటి చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+