"స్పిరిట్" మూవీలో విలన్‌గా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్‌ వరల్డ్‌ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు.

ఈ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తుండగా.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. తన ఫిల్మ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు.

spirit-movie-villain-chances-for-gopichand-who-is-best-friend-of-hero-prabhas-and-film-directed-by-s

ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది. అలానే న్యూ ఇయర్ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో నిల్చొని ఉండగా.. త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రభాస్ మొదటిసాటి అంత రా అండ్ రస్టిక్ గా కనిపించడంతో ఆ ఫోటో ఫుల్ ట్రెండ్ అయ్యింది.

కాగా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్.. ఈ మూవీలో డార్లింగ్ ని ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ అంతా తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీ క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు లేటెస్టుగా మరో హాట్ బజ్ నడుస్తోంది. మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో సైతం మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న నెగటివ్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా సందీప్ రెడ్డి వంగాతో ఫోటో దిగడం డిస్కషన్ కు తెర లేపుతోంది. అయితే ఈ చిత్రంలో గోపీచంద్ విలన్‌గా కనిపిస్తారా లేదా ప్రభాస్‌కు సపోర్టింగ్ రోల్ చేస్తారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ 'వర్షం' సినిమాలో కలిసి నటించి మెప్పించారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

spirit-movie-villain-chances-for-gopichand-who-is-best-friend-of-hero-prabhas-and-film-directed-by-s

ఇక సందీప్ సినిమాల్లో క్యారెక్టర్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి అని అందరికీ తెలిసిందే. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రస్తుతం గోపీచంద్ కెరీర్‌కు ఒక సాలిడ్ హిట్ కావాలి.. ఈ సమయంలో ఈ మూవీ ఆయన కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే గోపీచంద్ ఈ ప్రాజెక్ట్‌లో ఉంటే సినిమా స్థాయి మరో లెవల్‌కు వెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+