'భగవంత్ కేసరి' సినిమా చేయొద్దన్నారు: శ్రీలీల

నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా మెప్పించారనే విషయం మనకు తెలిసిందే. ఇది ఆహాలో ప్రసారమవుతోంది. మొదటి రెండు సీజన్లను ఇది పూర్తి చేసుకోగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంది. తాజాగా మూడో సీజన్ కూడా ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఎందుకు ఒప్పుకున్నారు : మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి, అర్జున్ రామ్ పాల్, శ్రీ లీల , కాజల్ అగర్వాల్ హాజరై సందడి చేశారు. ఇక బాలయ్య సాధారణంగానే రాజకీయాల గురించి మాట్లాడుతూ తనదైన స్టైల్ లో సందడి చేశారు. అసలు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?ఎందుకు ఈ సినిమాకు ఒప్పుకున్నారు అని బాలయ్య శ్రీలీలను ప్రశ్నించారు.

sreeleela about bhagavanth kesari movie

పెళ్లి సందడి సమయంలోనే కథ విన్నా : తాను నటించిన పెళ్లి సందడి సినిమా సమయంలోనే ఈ సినిమా కథ వినిపించారని, అప్పటికే కథానాయికగా అవకాశాలు వస్తున్నాయని, అటువంటి తరుణంలో కూతురి పాత్ర అంటే చాలా కష్టమని, తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావని చాలామంది చెప్పినట్లు శ్రీలీల వెల్లడించింది. ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోవద్దని సలహా ఇచ్చారని చెప్పింది. కూతురి పాత్ర అంటే హీరోయిన్ గా కెరీర్ దెబ్బతింటుందన్నారంది.

కూతురి పాత్ర వస్తుందో? రాదో : హీరోయిన్ గా ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఇలా కూతురి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయో రావు తెలియదని, అలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలనుకున్నానన్నారు. అందుకే ఈ సినిమాకు కమిట్ అయినట్లు చెప్పారు. కెరియర్ పరంగా తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే తాను ఈ సినిమాను ఒప్పుకోవడమేనని శ్రీ లీల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+