ఇన్ని ఫ్లాపులున్నా..నీ స్టార్ మాములుగా లేదుగా !!
సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. సక్సెస్ ఉంటేనే సలాం కొడతారు. కానీ, ఈ సూత్రాన్ని తిరగరాస్తోంది కన్నడ సుందరి శ్రీలీల. వరుసగా ఏడు పరాజయాలు పలకరించినా, ఈ అమ్మడి జోరు మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్‌లో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తున్నా, కోలీవుడ్, బాలీవుడ్ వైపు తన రూటు మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన శ్రీలీల చాన్స్ కొట్టేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
'అమరన్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి, ధనుష్‌తో ఒక భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం నేచురల్ స్టార్ సాయి పల్లవిని అనుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకోగా, ఆ అదృష్టం శ్రీలీలను వరించింది. గ్లామర్ డాల్‌గానే కాకుండా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో శ్రీలీల కనిపించనుండటం విశేషం.

ఇటీవల శివకార్తికేయన్‌తో చేసిన 'పరాశక్తి' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఖాతాలో వరుసగా ఏడో ప్లాప్ చేరింది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా ఇది కెరీర్ ఎండ్ కార్డ్ లాంటిదే. కానీ శ్రీలీల విషయంలో మాత్రం లెక్కలు మారుతున్నాయి. ఆమె ఎనర్జీ, డ్యాన్స్ ఫ్లోర్ మీద చేసే మ్యాజిక్ మేకర్లను ఇంకా ఆకర్షిస్తూనే ఉన్నాయి. అందుకే ధనుష్ వంటి అగ్ర హీరోలు కూడా ఆమెకు ఓటు వేస్తున్నారు. కేవలం సౌత్ మాత్రమే కాదు, శ్రీలీల కన్ను ఇప్పుడు బాలీవుడ్ మీద పడింది.
కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికీ 3 క్రేజీ ప్రాజెక్టుతో హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. నాగ్జిల్లా.. ఇది ఒక హారర్ ఫాంటసీ మూవీ. ఇప్పటికే దీనికి ఆమె సంతకం చేసింది. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై శ్రీలీల గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే టాలీవుడ్‌లో మళ్ళీ ఆమె గోల్డెన్ లెగ్ అయిపోవడం ఖాయం. వరుస ప్లాపులు వస్తున్నా ధైర్యం కోల్పోకుండా, తన టాలెంట్‌పై నమ్మకంతో ముందుకు సాగుతున్న శ్రీలీల నిజంగా గ్రేట్. ధనుష్ సినిమా ఆమెకు తమిళంలో బలమైన పునాది వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ లక్కీ గర్ల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications