శ్రీలీల.. సెల్ఫీ విత్ సీఎం సాబ్: ఫిట్‌నెస్ మంత్రం అదే..
Sreeleela: శ్రీలీల. టాలీవుడ్‌లో రైజింగ్ హీరోయిన్. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లిసందడితో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన తరువాత ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశం దక్కని నటి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన వరుసబెట్టి సిినిమాలు చేస్తోన్న హీరోయిన్.
ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్, గుంటూరుకారంలల్లో నటించింది. రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. రవితేజ సరసన మరో సినిమాకూ సైన్ చేసింది శ్రీలీల. ఇది రవితేజ 75వ సినిమా. ఆర్టీ 75 అనేది దీని వర్కింగ్ టైటిల్. భాను భోగవరపు దర్శకుడు.

చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న శ్రీలీల.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తళుక్కుమంటూ మెరిసింది. కర్ణాటకలోని బళ్లారిలో నిర్వహించిన యోగా దినోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనికి చీఫ్ గెస్ట్. బళ్లారి జిల్లా అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సిటీ టౌన్ షిప్‌లో ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. నగరంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. శ్వాస యోగ పీఠాధిపతి వచనానంద స్వామిజీ, గౌరి గద్దెకు చెందిన వినయ్ గురూజీ, ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి కే గోవిందరాజ్, ఎమ్మెల్యేలు తుకారాం, శ్రీనివాస్ ఎంటీ, కేఎంఎఫ్ చీఫ్ భీమా నాయక్ ఇందులో పాల్గొన్నారు.
సిద్ధరామయ్యతో పాటు శ్రీలీల కూడా వస్తోన్నారనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున యోగా దినోత్సవానికి హాజరయ్యారు స్థానికులు. ప్రోగ్రామ్ ముగిసిన అనంతరం సిద్ధరాయ్యతో కలిసి శ్రీలీల సెల్ఫీ దిగారు. తాను రోజూ యోగా చేస్తానని, ఫిట్‌నెస్ సాధించడానికి ఇదే ప్రధాన కారణమని అన్నారు శ్రీలీల.












Click it and Unblock the Notifications