ఆ హీరో అయితే చేయను..ఈ హీరో అయితే ఓకే..శ్రీలీల సంచలనం
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప2 సినిమాలో ఐటం సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐటం సాంగ్‌కు సంబంధించిన ఫొటో సైతం లీక్ అయింది. అయితే గతంలో శ్రీలీల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తాను ఐటం సాంగ్స్‌లో నటించనని చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో ఐటం సాంగ్‌లో నటించడానికి ఓకే చెప్పింది. అలాగే గతంలో తమిళ స్టార్ హీరో నటించిన Goat సినిమాలో కూడా ఐటం సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించారట చిత్ర యూనిట్.
తమిళంలో యంగ్ హీరోల సరసన నటిస్తోన్న సమయంలో ఐటం సాంగ్‌లో నటించడం సరైంది కాదంటూ కొందరు ఇచ్చిన సూచనలతో విజయ్ సాంగ్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ సాంగ్‌ను త్రిషతో కానిచ్చేశారు. గతంలో విజయ్‌తో ఐటం సాంగ్ రిజెక్ట్ చేసిన శ్రీలీల, ఇప్పుడు అల్లు అర్జున్‌తో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ చేయడంతోనే ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల నటించిందని తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో ఐటం సాంగ్‌గానూ శ్రీలీల రూ. 2 కోట్లు తీసుకుందని సమాచారం.












Click it and Unblock the Notifications