ఆ హీరోతో నటించనని సినిమా నుంచి తప్పుకుని శ్రీలీల..!

తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.

అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా నుంచి తప్పుకుని పెద్ద షాకిచ్చింది. విజయ్ తాజాగా నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను స్పందించారట చిత్ర యూనిట్.

sreeleela rejected vijay goat movie offer

స్టార హీరో కావడంతో తొలుత ఈ సినిమాలో ఐటం సాంగ్ చేద్దామనే భావించిదంట శ్రీలీల. అయితే తమిళంలో యంగ్ హీరోల సరసన నటిస్తోన్న సమయంలో ఐటం సాంగ్‌లో నటించడం సరైంది కాదంటూ కొందరు ఇచ్చిన సూచనలతో విజయ్‌ సాంగ్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ సాంగ్‌ను త్రిషతో కానిచ్చేశారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్ చూసాక..శ్రీలీల చేయకపోవటమే బెస్ట్ అంటున్నారు. విజువల్‌గా ఈ సాంగ్ అంత వరస్ట్‌గా ఉందని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. దీంతో విజయ్ సినిమా నుంచి తప్పుకుని శ్రీలీల మంచి పని చేసిందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+