శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ ...?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్‌లో శ్రీలీల టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. శ్రీలీల చేతిలో ఉన్ననన్ని సినిమాలు మరే హీరోయిన్ చేతిలో లేవంటే..ఈ అమ్మడు హవా తెలుగు ఇండస్ట్రీలో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు సినిమాలు మొత్తం శ్రీలీల చేతిలోనే ఉన్నాయి. . ఇదిలా ఉంటే శ్రీలీల.. హీరో అల్లు అర్జున్‌తో నటించిన అవకాశం వచ్చినప్పటికీ ..దానిని రిజెక్ట్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు.
ఈ పుష్ప-2 పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఈ సినిమాలో కూడా శ్రీలీలనే మొదట హీరోయిన్‌గా అనుకున్నారంట. అయితే శ్రీలీల, అల్లు అర్జున్ సినిమాను రిజెక్ట్ చేసిందట. డేట్స్ ఖాళీ లేకనే అల్లు అర్జున్‌తో సినిమాను శ్రీలీల వదులుకుందట.తనకు ఏమాత్రం కాల్ షీట్స్ లేకపోవడంతోనే ఈ సినిమా కథ నచ్చినప్పటికీ వదులుకోవాల్సి వస్తుందని చెబుతూ ...శ్రీలీల ఈ సినిమా అవకాశాన్ని వదులుకుందట.

అయితే ఈ విషయంపై శ్రీలీలకు అల్లు అర్జున్ కాల్ చేసి మాట్లాడారని తెలుస్తుంది. నా సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ బన్ని తనదైనశైలిలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అల్లు అర్జునే స్వయంగా ఫోన్ చేయడంతో..ఆయనతో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఎలాగైతే శ్రీలీల- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2లో శ్రీలీల ఐటం సాంగ్‌లో నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఐటం సాంగ్ విషయంలో తొలుత బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌తోపాటు పలువురు స్టార్స్ పేర్లు వినిపించాయి. రెమ్యునరేషన్ కారణంగా శ్రద్ధాకపూర్ ఈ టీమ్‌లో భాగం కాలేకపోయారని సమాచారం. ఈక్రమంలోనే చిత్ర టీమ్ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే నిజం అయితే కనుక శ్రీలీల, అల్లు అర్జున్ వేసే స్టెప్స్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోవాల్లిపోవడం ఖాయం.












Click it and Unblock the Notifications