స్టార్ హీరో విజయ్ సినిమాలో ఐటం సాంగ్ చేయనున్న శ్రీలీల..
ఒకేసారి వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో బిజి అయిపోయింది శ్రీలీల. హీరోయిన్‌గా కాకుండా కూతురిగా చేసి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక, శ్రీలీల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయిన అభిమానులు మరెందరో. ఈ ముద్దుగుమ్మ గత సంవత్సరం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజిగా గడిపేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ప్రాజెక్టులు లేవి లేక సైలెంట్‌గా ఉంది. ఇక, ఏడాది శ్రీలీల 'గుంటూరు కారం' సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా ఆశించినంత ఫలితాలు అందుకోలేకపోయిన ఆ మూవీలోని శ్రీలీల డ్యాన్స్‌కు ఫ్యాన్స్ తమను తామే మరిచిపోయేలా చేసింది. ఈ అమ్మడు డ్యాన్స్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉంది. అయితే, ఈ సినిమా కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. అయితే, తాజాగా శ్రీలీల గురించి మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయబోతున్నారని టాక్.

శ్రీలీల స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ని శ్రీలీల చేస్తున్నట్లు మీడియా వర్గాలు కోడే కూస్తున్నాయి. విజయ్ హీరో గా నటిస్తున్న'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమాలో శ్రీలీల ఓ ఐటం సాంగ్‌లో మెరవునున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ న్యూస్ విన్న చాలామంది అభిమానులు మాత్రం అప్పుడే శ్రీలీల ఐటెం సాంగ్ చేయడమేంటీ? అని షాక్‌కు గురువతున్నారు. చాలామంది హీరోయిన్లు తమకి మూవీ ఆఫర్లు తగ్గినప్పుడు మాత్రమే ఐటం సాంగ్స్‌కు ఓకే చెబుతుంటారు.
అందుకే శ్రీలీల ఫ్యాన్స్ చాలామంది ఈ న్యూస్ విని కంగారు పడుతున్నారు. మరికొందరేమో శ్రీలీల స్టార్‌డమ్ అప్పుడే తగ్గిపోయిందా అనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ అమ్మడు ఇటీవలే అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారని కూడా తెలుస్తోంది. కానీ, ఈ న్యూస్ ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే, ఈ బ్యూటీ ఈ సంవత్సరం హీరోయిన్ గా ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది..












Click it and Unblock the Notifications