చేతిలో గ్లాసుతో షాకిచ్చిన ఇచ్చిన శ్రీలీల
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. మాస్ రాజా రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది ఈ అమ్మడు. ఆ సినిమా తో పాటు పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ మీద ఉంది. ఈమధ్యనే శివ కార్తికేయన్ సినిమాలో ఛాన్స్ అందుకుని కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.

ఇక ఈ ఏడాదే బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.దీంతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా శ్రీలీలనే ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఓ కెఫేలో వాటర్ మిలెన్ జ్యూస్‌ని సిప్ చేస్తూ శ్రీలీల దిగిన ఫోటోతో పాటు,తనలోని హాట్‌నెస్‌ను బయటపెడుతూ మరో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. శ్రీలీల ఇచ్చిన ఫోజులను అలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోవాలనిపించేలా ఉన్నాయి. ఆఫ్ స్క్రీన్‌లో ఇలా తన ఫోటో షూట్స్‌తో శ్రీలీల యూత్‌ను డిస్ట్రబ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications