స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకో తెలుసా..?
తన డ్యాన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది నటి శ్రీలీల. గతేడాది వరుసగా ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ. ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో గుంటూరు కారం చిత్రంతో మొదలుపెట్టింది. కానీ, ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఎలాంటి టాక్ లేదు. గుంటూరు కారం చిత్రంలో తన నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడుకి పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ, ఇలాంటి సందర్భంలో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకు శ్రీలీల నో చెప్పినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన విజయ్ సినిమాలో శ్రీలీలకు అవకాశం వచ్చింది. అయితే, ఈ అమ్మడు మాత్రం ఆ సినిమాకు నో చెప్పేసింది. అయితే, అందుకు కారణం లేకపోలేదని సీనీ వర్గాలు అంటున్నాయి. విజయ్ హీరోగా వస్తున్న చిత్రం గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఇదే చివరి సినిమా అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మూవీ మేకర్స్ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. శ్రీలీల ఈ ఆఫర్‌కు నో చెప్పినట్లు సమాచారం. కోలీవుడ్‌లో స్పెషల్ సాంగ్‌లో ఎంట్రీ ఇవ్వడం కంటే హీరోయిన్‌గా పరిచయమవ్వడం మంచిదని ఆమె భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక, కోలీవుడ్‌లో శ్రీలీల అజిత్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అజిత్, శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అయితే, శ్రీలీల ఈ ఆఫర్‌కు నో చెప్పడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె పలు ఇంటర్వ్యూలలో స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పింది. అయితే, శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications