పవన్ కల్యాణ్‌పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఆ వీడియో జత చేసి మరి
నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.
తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలపై కూడా తన ధిక్కార స్వరం వినిపిస్తోంది. నాకు వైసీపీ వాళ్లు ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీలో కొందరి నాయకుల వల్ల పార్టీ ఓడిపోయిందని చెప్పి కొందరి నేతలపై విమర్శలు గుప్పించింది.

సోషల్ మీడియాలో ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిందనే కారణంతో శ్రీరెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ నాడు నేడు అమ్మ ఒడి, దీవెనలు, కానుకలు.. ఇలా ఒకటి కాదు..నోటికొచ్చిన పేర్లన్నీ పెట్టుకున్నారని జగన్‌ను ఎద్దేవా చేసిన వీడియోను పోస్ట్ చేసింది. మామయ్య వస్తున్నాడు చెప్పండి.
— Sri Reddy (@SriReddyTalks) July 26, 2024
పలక బలపం పట్టుకుని అఆఇఈలు రాయిస్తే కాదు అంటూ గతంలో చెప్పిన మాటలకు.. సంక్షేమ పథకాలన్నీ మేం ఆపం. కచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ అలాగే నడుస్తాయి. ఓ పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం తప్పా, తక్కువ చేయాలనుకోవట్లేదు అంటూ ఇటీవల పవన్ మాట్లాడిన మాటలకు జోడించి శ్రీరెడ్డి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. అంతేకాకుండా జఫ్పా, సిగ్గులేని వెధవ అని తిట్టే ఎమోజీలను యాడ్ చేసి చివర్లో పవన్ కల్యాణ్ కింద కూర్చుని ఏడ్చే ఓ సినిమాలోని సీన్‌ను తన పోస్ట్‌కు జత చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ గురించి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications