"ఈ సినిమా తర్వాత తనను మిస్ అవుతానేమో"
కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది హర్ష్ రోషన్, శ్రీదేవి జంట. అయితే వీరిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండ్ మేళం'.. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మార్చి 13న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా.. ఎమోషనల్ డైలాగ్స్ తో ఉంది. మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందీ గ్లింప్స్.
రోషన్‌తో ‘కోర్టు’ సినిమాలో చేయడం నాకు చాలా చాలా బాగా అనిపించింది.
— idlebrain.com (@idlebraindotcom) February 14, 2026
ఈ సినిమా తర్వాత తనను మిస్ అవుతానేమో. నాకు రోషన్ మంచి కో-ఆర్టిస్ట్.
— Sridevi#BandMelam Glimpse Launch pic.twitter.com/24lzgp44SY
అయితే బ్యాండ్ మేళం మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న యువ నటి శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అంతకుముందు కోర్ట్ మూవీలో హర్ష్ రోషన్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే రోషన్‌తో 'కోర్ట్' సినిమాలో చేయడం నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఈ సినిమా తర్వాత తనను మిస్ అవుతానేమో.. నాకు రోషన్ మంచి కో- ఆర్టిస్ట్.. అని శ్రీదేవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోషన్- శ్రీదేవి హిట్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బ్యాండ్ మేళం మూవీ కోర్ట్ మూవీకి మించిన హిట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు.

ఇదే మూవీపై నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ 'ఈ కథ విన్నప్పుడే నాకు రోషన్, శ్రీదేవి అయితే బావుంటుందని అనిపించింది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా బ్యాండ్ మేళం నిలుస్తుంది' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు, అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ఇక ఈ మూవీ మార్చి 13న థియేటర్లలో విడుదల కానుంది.
-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications