శ్రీలీల 'గాలి' మళ్లిందిరోయ్.. మళ్లీ వైరల్ అయిపోదాం అంటూ..!
వైరల్ వయ్యారి అంటూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా.. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెల 18న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో నటించిందుకు శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్. ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ మూవీ. తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఈ మూవీలో జెనీలియా కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ ను పెంచేశాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ పాటలో అటు శ్రీలీల, కిరీటీ పోటీ పడి చేశారు. ఈ సాంగ్ లో వారి కష్టం కనపడుతుంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. జూనియర్ మూవీ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ బ్యాటీకి మేకర్స్ ఏకంగా రూ.4 కోట్లు చెల్లించారని తెలుస్తోంది. ఇతర సినిమాలకు రూ. 2 కోట్లు తీసుకునే శ్రీలీల.. హీరో కొత్త వాడు కావడంతో ఈ స్థాయి పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త వైరల్ కావడంతో శ్రీలీల దశ తిరిగింది.. శ్రీలీల గాలి మళ్లిందిరోయ్.. అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ లోనూ వైరల్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో అయిదు సినిమాలున్నాయి. జూనియర్ మూవీతో పాటు రవితేజ సినిమా మాస్ ధమాకా, ఉస్తాద్ భగత్ సింగ్, హిందీలో ఆషికి 3, తమిళంలో పరాశక్తి సినిమాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications