వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!
అప్పట్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. ఆ తర్వాత అల్లరి నరేష్ సినిమాలు మినిమం గ్యారంటీ హిట్ అని టాక్ ఉండేది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు కూడా అలాగే మారిపోతున్నాడు. ఆయన వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నెలలోనే శ్రీ విష్ణు హీరోగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతవారం విష్ణు విన్యాసంతో అలరించిన శ్రీవిష్ణు.. ఈ వారం మృత్యుంజయ్ మూవీతో థియేటర్ల వద్ద సందడి చేశాడు. విష్ణు విన్యాసం మూవీకి హిట్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీకి కూడా హిట్ టాక్ రావడంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'మృత్యుంజయ్'.. తొలి ఆట నుంచే ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్.. బుక్ మై షో లో 'మృత్యుంజయ్' మూవీకి మొదటి రోజున 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అయితే శనివారం ఆ సంఖ్య భారీగా పెరిగింది. వీకెండ్ పూర్తయ్యే వరకూ ఇలానే ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 6 కోట్ల 50 లక్షలుగా ఉంది. ఇక మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక శ్రీవిష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' మూవీ గత వారంలోనే విడుదలైంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. అలా వారం క్రితమే ఒక సూపర్ హిట్ ను అందుకొని.. మరోవారంలోనే మరో సినిమాను రిలీజ్ చేసి అదికూడా సూపర్ హిట్ వైపు దూసుకెళ్లడం ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications