డేంజరస్ ఫ్లూ బారిన పడ్డ స్టార్ హీరో- సైలెంట్ గా దేశం మొత్తం.. !!

దేశంలో క్రమంగా హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. అనేక నగరాలు దీని బారిన పడ్డాయి. స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగిపోతోండటమే దీనికి నిదర్శనం. దేశం మొత్తం మీద వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, కేరలల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటోంది. కర్ణాటకలో 4,500లకు పైగా స్వైన్ ఫ్లూ కేసులు రికార్డయ్యాయి. బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ సైతం స్వైన్ ఫ్లూ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. హెచ్1ఎన్1 సోకడం వల్ల అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. షూటింగ్ లో భాగంగా కొద్ది రోజులుగా వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తోన్నారు. ఇటీవలే రాంచీ వెళ్లొచ్చారు. ముంబై తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు.

Star Actor Tests Positive for Swine Flu H1N1 Amid His Latest Movie Box Office Success Bengaluru Gig

జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే హెల్త్ చెకప్ చేయించుకున్నారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, తగిన జాగ్రత్తలు, మందులతో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.

కింగ్.. స్టైల్, స్వాగ్ అండ్ ఛరిష్మా: తగులబెట్టేస్తాడు: రిలీజ్ డేట్ లాక్
కింగ్.. స్టైల్, స్వాగ్ అండ్ ఛరిష్మా: తగులబెట్టేస్తాడు: రిలీజ్ డేట్ లాక్

ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం ఆవారాపన్ 2. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోందీ ఫిల్మ్. 2007 లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆవారాపన్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. ఈ సినిమా ప్రమోషన్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన బెంగళూరుకు రావాల్సి ఉంది. స్వైన్ ఫ్లూ సోకడం వల్ల బెంగళూరుకు రాలేకపోతున్నానంటూ తన అధికారిక ఇన్ స్టాలో స్టోరీని పోస్ట్ చేశారు.

మమత బెనర్జీకి షాకిచ్చిన పోలీసులు: సుమోటోగా స్వీకరణ
మమత బెనర్జీకి షాకిచ్చిన పోలీసులు: సుమోటోగా స్వీకరణ

నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశేష్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ శివం పండిట్ గా పవర్‌ఫుల్ రోల్ లో నటించారు. మానవ అక్రమ రవాణా, కిడ్నాప్ అయిన అమాయక పిల్లలను రక్షించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సామాజిక రుగ్మతలను కళ్లకు కట్టేలా చూపించడంలో ఈ కథ విజయం సాధించింది. దిశా పటానీ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ను పోషించారు. విలక్షణ నటి షబానా అజ్మీ గ్యాంగ్‌స్టర్ క్వీన్ నఫీసా పాత్రలో అదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+