భర్తకు దూరంగా ఉంటున్న స్టార్ నటి?
ప్రేమించి పెళ్లిచేసుకోవడం.. కొద్దిరోజులకు అభిప్రాయాలు కలవడంలేదంటూ విడిపోవడం అనేది ఇటీవలికాలంలో ఒక ఫ్యాషన్ లా మారిపోయింది. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో?.. ఎందుకు విడిపోతున్నారో? వారికే తెలియాలి. తమ అభిప్రాయాలు కలవడంలేదని చెబుతున్నప్పుడు వివాహం చేసుకోవడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో చేయడంతోపాటు ఇంటిపేరును మార్చేస్తుంటారు.
ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత తాము విడిపోయామని, తమకు స్వేచ్ఛ లాంటి గోప్యత కావాలంటారు. స్వేచ్ఛకు, ప్రైవసీకి తేడా ఏమిటనేది వారికే తెలియాలి. తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ఒక యాంకర్ తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సీరియల్స్ లో నటించడంతోపాటు యాంకర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి కొన్ని పాత్రలు చేసింది. మంచి అవకాశాలు దక్కించుకోవడంతోపాటు ఆదాయం కూడా బాగానే ఆర్జించారు.

ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలే పెద్దవయ్యాయి. తర్వాత కొద్ది నెలల నుంచి భర్తకు దూరం జరిగింది. ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ లో కూడా భర్త ప్రస్తావనను తీసుకురాలేదు. దీంతో అభిమానులకు కొత్తగా డౌట్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏం జరిగింది? ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? అనే విషయాలను ఇరువైపులా పెద్దలు తెలుసుకోవాలని, వారి తరఫున కూర్చొని సమస్యను పరిష్కరించాలని అభిమానులు సూచిస్తున్నారు. చిన్న చిన్న వివాదాలకే వివాహ బంధాన్ని వదులుకోవద్దని, గొడవలేమైనా ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతే రెండోవైపు కూడా సర్దుకుపోతారని, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటేనే కాపురం సవ్యంగా సాగుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి వీరిద్దరి గొడవ ఏమవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications