న్యూడ్‌గా కనిపించిన తెలుగు స్టార్ యాంకర్..అతని వల్లే అంటూ ..

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేవారిలో చాలా మందికి పెద్దగా నేపథ్యం ఉండదు. తమ కష్టంతో, ప్రతిభతో మెల్లిమెల్లిగా మెట్లు ఎక్కి స్టార్‌డమ్‌ను అందుకుంటారు. టాలీవుడ్‌లో సహాయ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శరణ్య ప్రదీప్ ప్రయాణం సరిగ్గా అలాంటిదే. తెరపై స్టార్ హీరోలకు అక్కగా, చెల్లిగా మెప్పిస్తున్న ఈ తెలంగాణ బిడ్డ ప్రయాణం అసాధారణమైనది.

శరణ్య ప్రదీప్ తెలంగాణలోని నిజామాబాద్‌లో పుట్టి పెరిగింది. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత, సినిమా కలలను నెరవేర్చుకోవడానికి ముందు, ఆమె తన సొంత ప్రాంతంలో ఒక లోకల్ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి, ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తూనే, సినిమా ఆడిషన్స్‌కు హాజరయ్యేది. ఆ యాంకరింగ్ అనుభవమే ఆమెకు సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు పెంచింది.

Star anchor poses nude with husband s consent

శరణ్య జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశం ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ద్వారా వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' సినిమాలో సాయి పల్లవికి అక్క పాత్రకు ఎంపికైంది.'ఫిదా'లో ఆమె నటన సహజంగా, అద్భుతంగా పండింది. ముఖ్యంగా అక్క, చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను పంచుతూ ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ఒక్క సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. అంతేకాకుండా, ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది.

ఒక లోకల్ యాంకర్ స్థాయి నుంచి ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ వరకు ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం.'ఫిదా' విజయంతో శరణ్య ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు దాదాపు 25కు పైగా సినిమాల్లో నటించి, టాలీవుడ్‌లో అత్యంత బిజీ సహాయ నటులలో ఒకరిగా మారింది.శైలజా రెడ్డి అల్లుడు,జాను,30 రోజుల్లో ప్రేమించడం ఎలా?,పుష్పక విమానం,వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

శరణ్య ప్రదీప్ ఇటీవల సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో వివస్త్రగా కనిపించే పాత్రలో నటించి, నటిగా తన సాహసాన్ని, వృత్తిపరమైన అంకితభావాన్ని చాటుకుంది.

ప్రస్తుతం సహాయక నటిగా బిజీగా ఉన్న శరణ్య ప్రదీప్, చివరిసారిగా కిరణ్ అబ్బవరం సినిమాలో కనిపించింది. కమర్షియల్ సక్సెస్, విమర్శకుల మెప్పు రెండింటినీ సాధించిన ఈ నటి, రాబోయే రోజుల్లో ఎలాంటి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+