స్టార్ యాంకర్ రష్మీ ఇంట విషాదం... త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ మెసెజ్‌లు..
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వారుండరు. జబర్ధస్త్ షోతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగు టీవీషోలలో ఈ ముద్దుగుమ్మ హవా నడుస్తుంది. వచ్చి రానీ తెలుగుతో, తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇదిలా ఉండగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రష్మీ గౌతమ్ తాతయ్య అనారోగ్యంతో మృతిచెందారు. తనని ఎంతో ప్రేమగా చూసుకున్న తాతయ్య ఇక లేకపోవడంతో తట్టుకోలేని రష్మి సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఎమోషన్‌ల్ పోస్ట్‌ను షేర్ చేసింది. పోస్టుతోపాటు ఓ తన తాతయ్య ఫోటోను కూడా అభిమానులతో పంచుకుంది. రష్మీ తాతయ్య బామ్మ తలకు నూనె రాస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకుంది ఈ అమ్మడు.
ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది అదేంటంటే.. 'మా తాత నిజమైన స్త్రీవాది. చివరకు మా తాతయ్య స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఈ నెల 17వ తేదీన మా తాతయ్య తీవ్ర ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలికాం. ఇక మా బామ్మ తాతయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మనసులు విడదీయలేనివి. బామ్మ భౌతికంగా దూరమయ్యాక తాతయ్య ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు. ఏడాదిన్నర నుంచి బామ్మ గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది' అని తన బాధను ఇలా చెప్పుకొచ్చింది రష్మి. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు్ చూసిన రష్మి ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అంతేకాదు, ఈ విషాదం నుంచి రష్మీ త్వరగా కోలుకోవాలంటూ మెసెజ్‌లు కూడా చేస్తున్నారు.

పలు సినిమాల్లో కూడా..
ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్క టీవీషోలకే పరిమితమవ్వకుండా యాంకరింగ్‌లో కొనసాగుతూనే మరోవైపు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఒకప్పడు సినిమాలు, చిన్నచిన్న సీరియల్స్‌లో నటించిన రష్మీకీ అవి ఆశించినంత ఫలితాలను అందించలేదు. కానీ, ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ టీవీ షోతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ షోలో యాంకర్‌గా కొనసాగతుంది అమ్మడు. ఇక, ఈ విషాదం నుంచి రష్మీ త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం..
Finally reunited in heavenly abode
— rashmi gautam (@rashmigautam27) August 21, 2024
A true feminist my grandfather was
17 Aug 2024 we bid our grandfather final good bye
Their souls were inseparable
We knew how difficult it was for him being away from her
He spoke about her everyday the last 1:5 year
We always needed them…












Click it and Unblock the Notifications