స్టార్ హీరోలకన్నా ఎక్కువగా ఆస్తులు కూడబెడుతున్న బ్రహ్మానందం కొడుకు

స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న బ్రహ్మానందానికి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకంగా ఓ పేజీ ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమై తన డైలాగులతో, హావభావాలతో పాత్రలను రక్తికట్టిస్తూ కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాదు మంచి నటుడిగా గుర్తింపు పొందారు. దాదాపు వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందంకు ఆస్తులు కూడా భారీగా ఉన్నాయి. ఆయన కొడుకు గౌతమ్ ను పరిశ్రమలో హీరోగా నిలబెట్టాలని బ్రహ్మానందం ప్రయత్నించారు. మొదట్లో చేసిన ఒకటి, రెండు సినిమాలు మినహా తర్వాత ఆయన సినిమాలు చేయలేదు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

స్టార్ హీరోలకన్నా ఎక్కువగా
ఈ క్రమంలోనే ఆయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలకు మించి అధికంగా ఆస్తులను కూడబెడుతున్నట్లు తెలుస్తోంది. పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో నటించిన తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో గౌతమ్ నటించారుకానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అప్పటికే వ్యాపారాలను నిర్వహిస్తున్న గౌతమ్ సినిమాల్లో కాలక్షేపానికి నటించారు. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ లు భారీ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఐటీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. వాటినుంచి కూడా ఆదాయం భారీగా వస్తోంది. బెంగళూరు నగరంలో పదుల సంఖ్యలో రెస్టారెంట్స్ ఉన్నాయి.

Star comedian Brahmanandam s son Gautham has accumulated huge assets

ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం
వీటన్నింటి నుంచి గౌతమ్ కు నెలకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.360 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు గౌతమ్ కంటే వెనకబడ్డారు. వారి ఆదాయానికి, గౌతమ్ ఆదాయానికి అసలు పోలికే లేదు. ఈ విషయం తెలుసుకున్నవారంతా షాక్ కు గురవుతున్నారు. బ్రహ్మానందం ఆస్తులు సంపాదించాడని తెలుసుకానీ వాటిని మంచిగా పెట్టుబడులు పెట్టి పెద్దవి చేసే కొడుకు గురించి ఎవరికీ తెలియదు. తన తండ్రి బ్రహ్మానందంతో కలిసి త్వరలోనే గౌతమ్ ఓ సినిమా చేయబోతున్నారు. అది హిట్ అయితే వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+