'లైలా' సినిమాను నిండా ముంచింది పృథ్వీ కాదు.. ఆ స్టార్ హీరోనే..!

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి.ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పించారు. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ను విమర్శించారు.

దీంతో గేమ్ ఛేంజర్‌కు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్‌' ఫ్లాప్‌గా నిలిచింది.తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ సినిమాను ఇరకాటంలోకి నెట్టాయి. వైసీపీకి వచ్చిన 11 సీట్ల గురించి పృథ్వి చులకనగా మాట్లాడారు. వైసీపీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వితో పాటు, 'లైలా' సినిమాను కూడా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్విట్టర్‌లో లక్షకు పైగా లైలా సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు వెలిశాయి. బాయ్‌కాట్ లైలా అంటూ నేషనల్‌ లెవల్లో వైసీపీ శ్రేణులు 'లైలా' సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేశారు.క్షమాపణలు చెప్పకపోతే , సినిమాను బ్యాన్ చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్..క్షమాపణలు చెప్పడం జరిగింది.

star hero is behind the Laila movie disaster

హీరో విశ్వక్ సేన్‌తో పాటు దర్శకుడు మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పారు.మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు.దీనిపై పృథ్వి కూడా క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే జరిగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదిలా ఉంటే లైలా సినిమాకు ఇంతటి డ్యామేజ్ వెనుక చిరంజీవి కూడా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సినిమా ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవి, సినిమాల గురించి మాట్లాడకుండా , రాజకీయాలు గురించి మాట్లాడారు.ఈ సమయంలో చిరంజీవి జై జనసేన అంటూ అక్కడకు వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం నింపారు.జై జనసేన అనడంతో పాటు, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని ఆయన వ్యాఖ్యానించారు.చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు కూడా లైలా సినిమాకు మైనస్‌గా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్టు, లైలా మూవీ డిజాస్టర్ వెనుక వీరంతా ఉన్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+