ఆ స్టార్ హీరోయిన్ తో రామ్ చరణ్ మాట్లాడడు?
తెలుగులో స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యారు. రోజురోజుకు తన క్రేజ్ ను, ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. తండ్రి చిరంజీవిని మించి స్టార్ హోదా సంపాదించారు. దేశంలోని స్టార్ హీరోల వారసుల్లో వారికి మించిన క్రేజ్ తో ఉన్నది మాత్రం రామ్ చరణ్ అని చెప్పొచ్చు. ఇదంతా చిరంజీవి అదృష్టం అంటూ పరిశ్రమలో ఎంతోమంది మెగాస్టార్ ను కొనియాడుతుంటారు.
ఆరెంజ్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంతో ఆలోచించి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. షూటింగ్ జరిగే సమయంలో, రిహార్సల్స్, పాటల సమయంలో ఈ అమ్మడు రామ్ చరణ్ కు దూరంగా ఉండేది.

అయితే ఇటువంటి విషయాలను రామ్ చరణ్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారు. అనుకోకుండా ఒకరోజు షూటింగ్ పూర్తి అయిన తర్వాత తమన్నా.. రామ్ చరణ్ ను కలిసింది. మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడంవల్ల తాను ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవడంలేదని, ఏదైనా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో తాను దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.
ఈ విషయం తమన్నా చెప్పిన తర్వాత రామ్ చరణ్ రెండురోజులు ఆమెతో మాట్లాడలేదు. పరిశ్రమలో అయినా, షూటింగ్ జరిగే సమయంలో అయినా నటీనటులు ఒకరినొకరు సఖ్యతగా ఉంటూ, స్నేహభావంతో కలిసివుండటంవల్ల మంచి స్నేహితులుగానే కాకుండా షూటింగ్ లో సన్నివేశాలు కూడా చాలా అద్భుతగా వస్తాయని రామ్ చరణ్ తమన్నాకు చెప్పారు.

దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో స్నేహంతో మెలిగేవారు.. రచ్చ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల్లో, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంటుండుగా రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాతో చాలా బిజీగా ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications