లవర్‌తో రోడ్డు మీద పరుగులు తీసిన స్టార్ హీరో (వీడియో)
సినీ ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ అనే విషయాలు సర్వసాధారణం. చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారిలో కొంతమంది విడాకులు తీసుకుని తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పడం కూడా జరిగిపోయింది. ఇక మధ్యలోనే బ్రేకప్ చెప్పిన వారి లిస్ట్ కూడా చాలా పెద్దదే. తాజాగా తన లవర్‌తో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయాడు ఓ స్టార్ హీరో.
తమిళ స్టార్ హీరో విశాల్ తన లవర్‌తో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడైతే ఎవరైనా గుర్తు పడతారని విదేశాలకు వెళ్లిన విశాల్‌కు అక్కడ కూడా కష్టాలు తప్పలేదు. రోడ్డుపై ఓ అమ్మాయితో కలిసి చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నారు.దీనిని గమనించిన ఓ వ్యక్తి వారిని వీడియో తీస్తూ.. విశాల్‌ను పిలిచాడు.

వెంటనే ఇది చూసిన విశాల్ తమను ఎవరో వీడియో తీస్తున్నారని గమనించి..కెమెరాకు తన మొహాన్ని కనిపించకుండా ఆ అమ్మాయితో రోడ్డు మీద పరుగులు తీశాడు. అయితే విశాల్‌తో ఉన్న ఆ అమ్మాయి ఎవరో మాత్రం తెలియలేదు. గతంలో విశాల్ పలువురు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడనే రూమార్స్ వినిపించాయి. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌తో విశాల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపించాయి. కానీ తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని ఈ జంట క్లారిటీ ఇచ్చింది.
ఇక అర్జున్ రెడ్డి నటి అనీషాతో విశాల్ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కాని వారి పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ వయస్సు 48 ఏళ్లు. ఆయన ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నారని ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది.
Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq
— Ramesh Bala (@rameshlaus) December 26, 2023
ఆ అమ్మాయితో రిలేషన్‌లో లేకపోతే.. ఎందుకు అలా రోడ్లు మీద పరుగులు తీస్తారని విశాల్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విశాల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కొత్త ఏడాదైనా విశాల్ తన పెళ్లి గురించి ప్రకటన వెలువడుతుందో అని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే విశాల్ రోడ్డు మీద పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications