పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇక్కడ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించినవారే ఎక్కువగా ఉంటారు. సినీరంగంలో కాస్తంత పేరు సంపాదించుకోగానే రాజకీయ పార్టీని స్థాపిస్తుంటారు. దళపతి విజయ్ కూడా కొత్త పార్టీని ప్రకటించారు. ప్రస్తుతం అదే దారిలో మరో ప్రముఖ హీరో పయనిస్తున్నారు. ఆయన కూడా త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ తదితర నటుంతా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. విజయ్ కూడా ఇదేదారిలో పయనిస్తున్నారు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విశాల్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటునకు ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులను తమిళనాడు ప్రజలు ఆదరించారు.

విశాల్ కు తమిళనాట మంచి ఆదరణ ఉండటంతోపాటు సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం పాటుపడతాడనే పేరు ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించారు. వీటితో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి కేంద్రంగా కొన్ని వివాదాలు తలెత్తినప్పటికీ ఓ వర్గం మాత్రం ఆయన్ను బాగా ఆదరించింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన విశాల్ ఆర్.కే నగర్ నుంచి నామిమేషన్ వేశారు. అయితే అది తిరస్కరణకు గురైంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కొత్త పార్టీని పెడుతుండటం విశేషం అంటున్నారు.












Click it and Unblock the Notifications