విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరోలు?
తెలుగు సినీ పరిశ్రమలో ఏ సపోర్ట్ లేకుండా ఈ జనరేషన్ లో మంచి హీరోగా ఎదుగుతున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.
విజయ్ దేవరకొండ అతి తొందరలో స్టార్ హీరోగా ఎదుగబోతున్నాడని తెలిసిన తెలుగు సినిమా పరిశ్రమలోని కొంతమంది స్టార్ హీరోలు కలిసి అతన్ని ఎదగకుండా చేస్తున్నారు అనే టాక్ వస్తోంది. వాస్తవానికి విజయ్ కూడా కొంచెం అతి చేస్తూ మాట్లాడతాడు. స్టేజ్ ఎక్కినప్పుడు తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అది చాలామందిక నచ్చదు. చాలామంది అందుకే విజయ్ ను దూరం పెడుతుంటాడు.

విజయ్ ఎదిగితే వేరే హీరోలకి సమస్య అవుతుందనే ఉద్దేశంతో అతన్ని ఎదగకుండా చేస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. నిజానికి ఏ హీరో అతన్ని తొక్కేయాలని చూడకపోయినా కూడా తను ఎంచుకున్న కథల్లో దమ్ముంటే ఆ సినిమాలు ఘనవిజయం సాధిస్తాయి. అందుకు ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరెంత తొక్కాలని చూసినా పూర్తిగా తొక్కడం అనేది సాధ్యం కాదనే కామెంట్స్ వస్తున్నాయి.
మొత్తానికి విజయ్ దేవరకొండని ఎవరు తొక్కాల్సిన పనిలేదని, తను మాట్లాడిన ఓవర్ మాటల వల్ల తనకు తానే కొంతమంది ఒక్కోసారి బ్యాడ్ అయిపోతుంటాడు. ముందుగా ఇక్కడ ఎదగాలి అంటే ఎవరైనా ఆటిట్యూడ్ తగ్గించుకొని అందరిని కలుపుకుంటు ముందుకు వెళుతుండాలి. అప్పుడు ప్రజలే అభిమానులుగా మారిపోతారని ట్రేడ్ పండితులు సైతం విజయ్ దేవరకొండ కి సలహాలనిస్తున్నారు.












Click it and Unblock the Notifications