రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్?

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత్ జోడో యాత్ర పేరుతో తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించి జమ్ము కాశ్మీర్ లోని లఖన్ పూర్ లో ముగించారు. మొత్తం 3750 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రస్తుతం భారత్ న్యాయ్ యాత్ర పేరుతో మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ముంబయి వరకు చేయనున్నారు. జనవరి 14వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర మొత్తం 67 రోజులపాటు కొనసాగనుంది. 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదగా ఇది కొనసాగుతుంది.

ఆయన ఇంతవరకు వివాహం చేసుకోలేదు అన్న విషయం తెలిసిందే. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ తన పుస్తకం 'నేతా అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'లో.. రాహుల్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. రాజ్ కపూర్ మనవరాలు, బాలీవుడ్ నటి కరీనా కపూర్ 2002లో రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని భావించినట్లు అందులో రాశారు.

Star heroine kareena kapoor wanted to marry Rahul Gandhi?

కరీనా నటించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూడటానికి రాహుల్ కూడా చాలా ఆసక్తి కనబరిచారని, 'రోండేవో విత్ సిమి గరేవాల్' అనే టీవీ షోలో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారని కరీనాకపూర్ ను అడిగినట్లు చెప్పారు. ఆమె వెంటనే రాహుల్ గాంధీ అని సమాధానం చెప్పారని, రాహుల్ తో డేట్ చేయడం.. అర్థం చేసుకోవడంలో తనకెలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అయితే 2009లో ఆమె తన మనసు మార్చుకున్నారని, 2012లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాహుల్ 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ బ్రహ్మచారిగానే కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+